తదుపరి వార్తా కథనం
Telangana High Court: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు రిజర్వు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 12, 2024
05:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది.
అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై వాదనలు వినిపించిన సీజీ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు తమ వాదనలను సమర్పించారు.
ఆయన మాట్లాడుతూ, సింగిల్ జడ్జి తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శికి అప్పీల్ చేసే అర్హత లేదని, ఇది అంగీకరించదగినది కాదని అభిప్రాయపడ్డారు.
ఇంకా అనర్హత పిటిషన్లపై స్పీకర్ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ఇరువైపులా వాదనలు పూర్తయిన తరువాత, సీజీ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తూ విచారణను ముగించనున్నట్లు ప్రకటించింది.