LOADING...
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్‌-గవర్నర్ భేటీకి గ్రీన్ సిగ్నల్
తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్‌-గవర్నర్ భేటీకి గ్రీన్ సిగ్నల్

Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్‌-గవర్నర్ భేటీకి గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2026
07:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ రాజకీయాలు ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ప్రతి గంటకూ రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉత్కంఠను పెంచుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ మార్క్‌ తమకు వచ్చిందని ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్, గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి మొదట ఆయనకు అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. దీంతో ఆయన రాజ్‌భవన్‌ నుంచి తిరిగి టీవీకే కార్యాలయానికి వెళ్లిపోయారు. కానీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి మారిపోయింది. సాయంత్రం 6.30 గంటలకు అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో, విజయ్ మళ్లీ రాజ్‌భవన్‌కు బయలుదేరారు.

వివరాలు

ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు

ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాల నుంచి ఆయనకు మద్దతు లభించగా, తాజాగా వీసీకే, ఐయూఎంఎల్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మద్దతు వివరాలను తీసుకొని ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వచ్చారు. అయితే తొలుత గవర్నర్ షెడ్యూల్ కారణంగా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. ఆ సమయంలో గవర్నర్ తన కేరళ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు అపాయింట్‌మెంట్ ఖరారు చేయడంతో, విజయ్ మరోసారి రాజ్‌భవన్‌కు వెళ్లారు.

Advertisement