Loading...
Himachal Pradesh: హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి
హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి

Himachal Pradesh: హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లాహౌల్‌-స్పితి జిల్లాలోని పంగీ-కిలాద్‌ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ టాటా సుమోపై ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడటంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యాహ్నం చోటుచేసుకోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం.. కుల్లు నుంచి పంగీ వైపు వెళ్తున్న టాటా సుమోపై భారీ బండరాళ్లు ఒక్కసారిగా పడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతతో వాహనం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రెస్క్యూ బృందాలు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వివరాలు 

వాహనంలో సుమారు 15 మంది ప్రయాణం 

ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో సుమారు 15 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

భారీ బండరాళ్లు నేరుగా వాహనంపై పడటంతో అది నుజ్జునుజ్జయింది.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

ఇదే పంగీ-కిలాద్‌ రహదారిపై గురువారం కూడా కొండచరియలు విరిగిపడటంతో అధికారులు ముందుజాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు.

మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం శుక్రవారం ఉదయం మాత్రమే రహదారిని తిరిగి తెరిచారు.

అయితే అదే రోజున మరోసారి కొండచరియలు విరిగిపడటంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పంగీ-కిలాద్‌ రహదారిపై విషాదం

ADVERTISEMENT