Russian-flagged oil tanker: అమెరికా ఆక్రమించిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్‌లో ముగ్గురు భారతీయులు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా జెండాతో సాగుతున్న వెనెజువెలా నౌక 'మ్యారినెరా'తో పాటు మరో ఆయిల్ ట్యాంకర్ నౌకను అమెరికా సీఝ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నౌకలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు రష్యా మీడియా ఇప్పటికే వెల్లడించింది. ఈ ముగ్గురు భారతీయులు హిమాచల్‌ప్రదేశ్, కేరళ, గోవా రాష్ట్రాలకు చెందినవారు. హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు చెందిన రిక్షిత్ చౌహాన్ మర్చంట్ నేవీ ఆఫీసర్. ఆయన వివాహం వచ్చే నెల జరగనున్నది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రిక్షిత్ సముద్రంపై రష్యా సంస్థ మొదటి సారి విధులు నిర్వహించడానికి వెనెజువెలాకు పంపింది.
వివరాలు
2025లో రష్యా సంస్థలో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా..
ఆయన కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం,జనవరి 7న చివరిసారి రిక్షిత్‌తో సంప్రదింపులు జరిగాయి. కొన్ని గంటలలోనే అమెరికా దళాలు నౌకను సీజ్ చేశారు. ''మా కుమారుడు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడండి''అని రక్షిత్ తల్లి రీతాదేవి ప్రధాని మోదీని అభ్యర్థించారు.ఫిబ్రవరి 19న తన కొడుకు వివాహాన్ని నిశ్చయించామని చెప్పారు. రక్షిత్ 2025లో రష్యా సంస్థలో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా చేరాడు. కొన్ని రోజుల క్రితం చివరిసారి మాట్లాడినప్పుడు అంతా బాగానే ఉందన్నాడు. వెనెజువెలాలో అమెరికా మిలిటరీ చర్యల కారణంగా, రష్యా సంస్థ అతనికి వెంటనే ఆ దేశం నుంచి తిరిగి రావాలని సూచించింది. జనవరి 10న, మన కుమారుడు ఉన్న నౌక సీజ్ అయ్యిందని మాకు తెలిసింది" అని చౌహాన్ తండ్రి వెల్లడించారు.
వివరాలు
నౌకలో 28 మంది సిబ్బంది
ఈ ఘటనపై విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించి, నౌకలో ఉన్న భారతీయుల వివరాలను నిర్ధారిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 28 మంది సిబ్బంది నౌకలో ఉన్నారు. వారిలో ఉక్రెయిన్, జార్జియా, మరియు రష్యన్ పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం.