Page Loader
HMPV: అస్సాంలో 10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్‌
అస్సాంలో 10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్‌

HMPV: అస్సాంలో 10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2025
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాంలో 10 నెలల చిన్నారిలో హెచ్ఎంపీవీ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. ఇది అస్సాంలో మొదటి కేసు కావడం గమనార్హం. శనివారం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. నాలుగు రోజుల క్రితం చిన్నారిని సిజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు డాక్టర్ ధృబజ్యోతి భూయాన్ పేర్కొన్నారు.

Details

రీసెర్చ్ కు అన్ని శాంపిల్స్

ICMR-RMRC నుండి వచ్చిన పరీక్షల ఫలితాల్లో హెచ్‌ఎంపీవీ నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. అన్ని శాంపిల్స్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా చైనాలో శీతాకాలం మార్పులతో ఇన్‌ఫ్లుఎంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ వంటి వైరస్‌లు వ్యాపిస్తున్నాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ తెలిపింది. అయితే భారత్‌లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ వైరస్‌లకు ఎదుర్కోవడంలో కేంద్ర ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని తెలిపింది.