
Srikakulam: ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు.. శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు హాలీడే
ఈ వార్తాకథనం ఏంటి
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని ప్రధాన నదుల్లో వరదనీరు భారీగా చేరుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలోకి నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 10 మండలాల్లోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించింది. జిల్లా విద్యాశాఖాధికారి ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
— SRIKAKULAM DISTRICT POLICE (@SRIKAKULMPOLICE) October 2, 2025
ll లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.ll
ll అర్ధ రాత్రి వేళలో లోతట్టు గ్రామాలను సందర్శించి పరిస్థితులను పర్యవేక్షణ.ll
శ్రీకాకుళం, అక్టోబరు 02.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ… pic.twitter.com/ZXHhar3CvK