తదుపరి వార్తా కథనం
Kasibugga stampede: కాశీబుగ్గ తొక్కిసలాట విషాదంపై హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 01, 2025
01:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె జిల్లా ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రమాదం జరిగిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణ సహాయ చర్యలు అందించడంలో ఎలాంటి విరామం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చారు. భారీగా గుంపు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు భక్తులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.