Page Loader
Dera Baba: బెయిల్‌పై విడుదలైన డేరా బాబా.. స్వాగతం పలికిన హనీప్రీత్
బెయిల్‌పై విడుదలైన డేరా బాబా.. స్వాగతం పలికిన హనీప్రీత్

Dera Baba: బెయిల్‌పై విడుదలైన డేరా బాబా.. స్వాగతం పలికిన హనీప్రీత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌కు మరోసారి బెయిల్ మంజూరైంది. ఈ రోజు ఉదయం జైలు నుంచి బయటపడ్డ డేరా బాబా ను స్వాగతించేందుకు డేరా బాబా ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు చేరుకుని, ఆయనను తీసుకెళ్లింది. రామ్ రహీమ్‌కు 30 రోజుల పాటు ఈ పెరోల్ మంజూరైంది. దీంతో ఆయన నేరుగా సిర్సా డేరా సచ్చా సౌదాకు చేరుకోనున్నారు. ఆశ్రమంలో ఆయన స్వాగతానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు.

Details

గతంలో 20ఏళ్లు జైలు శిక్ష

గతంలో 2024 అక్టోబర్‌లో 20 రోజుల పాటు బెయిల్‌పై బయట ఉన్న డేరా బాబా ఎన్నికల కార్యకలాపాలలో పాల్గొనకూడదని, హర్యానాలోకి ప్రవేశించకూడదని నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. మరో 16 సంవత్సరాల క్రితం జర్నలిస్టు హత్య కేసులో కూడా డేరా బాబా దోషిగా తేలాడు.