Andhra news: PPP మోడల్‌లో హోటల్ నిర్మాణం.. ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధీనంలోని స్థలాలలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్నందున, ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. పెట్టుబడి పరిమాణం,నిర్మించబోయే హోటలులో గదుల సంఖ్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని స్థలాల కేటాయం చేయాలని నిర్ణయించింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి స్థలాల ఎంపిక,కేటాయింపులు చేయాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 ప్రకారం, PPP మోడల్‌లో స్టార్ హోటల్ ప్రాజెక్టులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
ఒకే స్థలానికి అనేక ప్రతిపాదనలు వచ్చినప్పుడు ప్రాధాన్యత క్రమం:
ఇటీవలి కాలంలో అధిక సంఖ్యలో సమగ్రమైన ప్రాజెక్టు ప్రతిపాదనలు రావడం, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఒకే స్థలానికి పలువురు పెట్టుబడిదారులు పోటీ పడటం వల్ల కేటాయింపులలో తలెత్తే సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పెద్ద మొత్తంలో పెట్టుబడి ప్రతిపాదనలు స్థల వినియోగాన్ని సమర్థంగా ప్రణాళిక చేయడం సంస్థ విశ్వసనీయత, అనుభవం ప్రభుత్వానికి అధిక ఆదాయ భాగస్వామ్యం అందించే ప్రతిపాదనలు