Page Loader
Fake Noida Call Centre: కోట్లలో టోకరాకి యత్నం.. అడ్డంగా దొరికిన మాజీ జీవిత బీమా పాలసీ ఏజెంట్లు
కోట్లలో టోకరాకి యత్నం.. అడ్డంగా దొరికిన మాజీ జీవిత బీమా పాలసీ ఏజెంట్లు

Fake Noida Call Centre: కోట్లలో టోకరాకి యత్నం.. అడ్డంగా దొరికిన మాజీ జీవిత బీమా పాలసీ ఏజెంట్లు

వ్రాసిన వారు Stalin
Jul 07, 2024
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌ మోసాలు మన దేశంలో నానాటికీ విస్తరిస్తున్నాయి. అలాగే ఇందులో భాగంగా కేవలం 2,500తో ఫోన్ డేటాను కొన్నారు. ఆ ఫోన్ డేటాను ఉపయోగించి దేశ వ్యాప్తంగా వందలాది మందిని కోట్లాది రూపాయలకు ఓ ముఠా టోకరా వేయబోయింది . ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.నోయిడాలోని నకిలీ కాల్ సెంటర్ నుండి వేల కోట్ల రుణాల కుంభకోణంలో వందలాది మందిని మోసం చేయడానికి ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ బీమా పాలసీలు,రుణాలు విక్రయించిన తొమ్మిది మంది మహిళలు సహా 11 మందిని అరెస్టు చేశారు. ఇద్దరు మాజీ జీవిత బీమా పాలసీ ఏజెంట్లు ఆధ్వర్యంలో నోయిడాలోని సెక్టార్ 51లో కాల్ సెంటర్ ఒక సంవత్సరం పాటు నిర్వహించారు.

వివరాలు 

నకిలీ ఆధార్ కార్డుల ద్వారా సిమ్ కార్డు కొనుగోలు

రుణాలు , బీమా పాలసీలపై అధిక రాబడిని ఇస్తామని నమ్మబలికారు. ఈ హామీతో దేశవ్యాప్తంగా పలువురిని ఈ ముఠా మోసగించిందని పోలీసులు తెలిపారు. స్కామ్‌ సూత్రధారులైన ఆశిష్‌, జితేంద్రలు తొమ్మిది మంది మహిళలను కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించుకున్నారు. వారు వ్యక్తులను పిలిచి ఈ పాలసీలను విక్రయిస్తారు. అక్రమంగా కొనుగోలు చేసిన నకిలీ ఆధార్ కార్డుల ద్వారా ఈ ముఠా సిమ్ కార్డులను కొనుగోలు చేసింది. అనుమానాస్పద బాధితులను లక్ష్యంగా చేసుకుని వారి గుర్తింపును దాచడానికి ఈ సిమ్ కార్డులు ఉపయోగించారు. సంస్థ కమీషన్ ఆధారంగా పనిచేసింది . మీరు ఎంత మంది వ్యక్తులను ఆకర్షిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుందని వారికి ఎరవేశారు.

వివరాలు 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డును అద్దెకు తీసుకుని ఛీటింగ్ 

ఇలా వచ్చిన డబ్బును కాజేయటానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డును అద్దెకు తీసుకున్నారు. కర్ణాటకలోని అరవింద్ అనే వ్యక్తి పేరిట వుంది డెబిట్ కార్డు. అతనికి నెలకు 10,000 అద్దెచెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా ఆయాచితంగా వచ్చిన డబ్బు.. అరవింద్ పేరిట వున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డు ఖాతాలోకి వెళ్లేది. స్కామ్ బాధితుల నుండి డబ్బు..ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది. ఆశిష్ , జితేంద్ర ఇద్దరూ నోయిడాలో డబ్బును ఉపసంహరించుకోవడానికి డెబిట్ కార్డులను ఉపయోగించేవారు. పోలీసుల దాడి తర్వాత ఆశిష్ ఉపయోగించిన బ్లాక్ డైరీ దొరికింది. ఏడాది కాలంగా జరిగిన ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయలను సంపాదించిన ప్రతి ఆర్థిక లావాదేవీని డైరీలో పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించాడు.

వివరాలు 

కేటుగాళ్ల గుట్టు రట్టు ఇలా ..

క్రైమ్ రెస్పాన్స్ టీమ్ (సిఆర్‌టి) ,స్థానిక సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో శుక్రవారం ఛేదించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) శక్తి మోహన్ అవస్తీ తెలిపారు. ఇలాంటి స్కామ్‌పై అప్పట్లో రాంచీలో కేసు నమోదైంది. ఆశిష్,జితేంద్ర 2019లో SBI లైఫ్ ఇన్సూరెన్స్‌లో మానేసిన తర్వాత ఈ మోసపూరిత కుట్రకు నాంది పలికారు.

వివరాలు 

రూ 2,500కి పదివేల మంది వ్యక్తుల డేటా కొనుగోలు 

ఈ ఇద్దరు కేటు గాళ్లు ..ఇండియా మార్ట్ నుండి 2,500కి సుమారు 10,000 మంది వ్యక్తుల డేటాను కొనుగోలు చేశారు. దేశమంతటా ప్రజలకు కాల్ చేయడం ప్రారంభించారు. రుణాలు ,బీమాను అందిస్తామనే నెపంతో వారిని మోసం చేశామని ఆశిష్ చెప్పాడు. అరెస్టయిన వారిలో కీలక నిందితులు ఆశిష్ కుమార్ అలియాస్ అమిత్, జితేంద్ర వర్మ అలియాస్ అభిషేక్‌లుగా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన తొమ్మిది మంది మహిళల్లో నిషా అలియాస్ స్నేహ, రేజు అలియాస్ దివ్య, లవ్లీ యాదవ్ అలియాస్ శ్వేత, పూనమ్ అలియాస్ పూజ, ఆర్తి కుమారి అలియాస్ అనన్య, కాజల్ కుమారి అలియాస్ సూర్తి, సరిత అలియాస్ సుమన్, బబితా పటేల్ అలియాస్ మహి, గరిమా చౌహాన్ అలియాస్ సోనియా ఉన్నారు.

వివరాలు 

 జ్యుడీషియల్ కస్టడీకి నిందితులు 

కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం ఈ కేసులో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేశారు. నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.