AP Annadata Sukhibhava Status : రైతులకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మూడో విడతగా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. ఈ విడతలో 46.85 లక్షల మంది రైతులకు కేంద్రం, రాష్ట్రం కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.6,000 చొప్పున జమ అవుతున్నాయి.
వివరాలు
రూ.2,676 కోట్ల నిధుల విడుదల
మూడో విడత చెల్లింపుల కోసం మొత్తం రూ.2,676 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,874 కోట్లు. ఇప్పటికే రెండు విడతలుగా రైతులకు రూ.14 వేల వరకు సాయం అందింది. ఇప్పుడు జమ అవుతున్న రూ.6 వేలతో కలిపి ప్రభుత్వం ఇచ్చిన ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం హామీ పూర్తవుతుంది. రైతుల ఖాతాల్లోకి రూ.6 వేల చొప్పున డబ్బులు జమ అవుతున్న నేపథ్యంలో... ప్రతి రైతు తన బ్యాంక్ ఖాతాను ఒకసారి చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోతే... సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.
వివరాలు
అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
రైతులు తమకు డబ్బులు జమ అయ్యాయా లేదా అన్న విషయాన్ని సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్‌తో స్టేటస్ తెలుసుకునే సదుపాయం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.
వివరాలు
ఇలా చెక్ చేయండి
ముందుగా https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో కనిపించే "Know Your Status" లింక్‌పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. పక్కనే కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తరువాత Search పై క్లిక్ చేస్తే మీ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి.
వివరాలు
ఈకేవైసీ సమస్య ఉంటే డబ్బులు రావు
స్టేటస్ చెక్ చేసినప్పుడు e-KYC పూర్తి కాలేదని చూపిస్తే... డబ్బులు ఖాతాలోకి జమ కావు. అలాంటి సందర్భాల్లో రైతులు దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన పత్రాలు ఇచ్చి e-KYC పూర్తి చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ స్టేటస్‌ను మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
వివరాలు
ఇలా చేయండి:
ముందుగా 9552300009 నెంబర్‌కు వాట్సాప్‌లో "Hi" అని మెసేజ్ పంపాలి. వచ్చిన ఆప్షన్లలో అన్నదాత సుఖీభవ సేవ ఎంచుకోవాలి. తరువాత Status Check ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రైతు ఆధార్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వెంటనే రైతు వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.