తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుంది. ఈ తుపానుకు 'మోచా' పేరు పెట్టారు. మెచా తుపాను నేపథ్యంలో తూర్పు రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
తుపానుకు 'మోచా' అని ఎలా పేరు పెట్టారు?
మోచా (మోఖా) అనేది యెమెన్ పదం. ఎర్ర సముద్రపు ఓడరేవు నగరానికి 'మోచా' పేరు పెట్టారు. ఈ ఓడరేవు 500 సంవత్సరాల క్రితం ప్రపంచానికి కాఫీని పరిచయం చేసింది. దానికి గుర్తుగా మోచా పేరు పెట్టారు. తుపానులకు పేరు పెట్టే క్రమంలో ప్రాంతీయ పరిస్థితులు, నిబంధనలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ (ESCAP) సభ్య దేశాలతో ఏర్పాటు చేసిన ప్రామాణిక వ్యవస్థ ప్రకారం తుఫానులకు పేరును ఆమోదిస్తుంది. అట్లాంటిక్, దక్షిణ అర్ధగోళంలో (హిందూ మహాసముద్రం మరియు దక్షిణ పసిఫిక్) ఉష్ణమండల తుఫానులు అక్షర క్రమంలో పేర్లను పెడుతుంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో పేర్లు అక్షరక్రమంలో ఇప్పిటకే జాబితా చేయబడ్డాయి.
మోచా తుపాను ఎప్పుడు తీరం దాటుతుంది?
మోచా తుపాను మే 9న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. మే 10న తుపానుగా మారుతుంది. మే 12నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు తుపాన్ కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుందని ఐఎండీ ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర చెప్పారు. చిన్న నౌకలు, మత్స్యకారులు మంగళవారం నుంచి సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 8 నుంచి 12 మధ్య అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో పర్యాటకం, ఆఫ్‌షోర్ కార్యకలాపాలు, షిప్పింగ్‌ను నియంత్రించాలని అధికారులను ఐఎండీ కోరింది.