Telangana: తెలంగాణలో హెచ్‌పీవీ టీకా పంపిణీ ప్రారంభం.. బాలికలకు రక్షణ కవచం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 28, 2026
12:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీకి శ్రీకారం చుట్టింది. దేశమంతటా 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు ఈ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ జాతీయ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో ప్రారంభించారు. తెలంగాణలో కూడా టీకాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్‌లోని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొత్తం కోటి 15 లక్షల మంది బాలికలకు ఈ టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.