Loading...
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు భారీ షాక్‌.. రూ.21 కోట్ల జరిమానా!
ఆంధ్రా పేపర్ మిల్లుకు భారీ షాక్‌.. రూ.21 కోట్ల జరిమానా!

Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు భారీ షాక్‌.. రూ.21 కోట్ల జరిమానా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కఠిన చర్యలు చేపట్టింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించినట్లు నిర్ధారించిన పీసీబీ.. ఆ పరిశ్రమకు రూ.21.01 కోట్ల పర్యావరణ పరిహారం విధించింది. గోదావరిలో వ్యర్థాలను విడుదల చేసేందుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేస్తూ.. పరిశ్రమలో కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేసింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్రా పేపర్ మిల్లుకు ఈ జరిమానా విధించినట్లు పీసీబీ వెల్లడించింది. వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణలో నిబంధనలు పాటించాలని పరిశ్రమకు స్పష్టం చేసింది.

వివరాలు

జూన్ 12 తేదీల్లో ఆంధ్రా పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీసులు

కాగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 26న తూర్పులంక ఇసుక మేటలు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా గుర్తించిన పర్యావరణ ఉల్లంఘనలపై పీసీబీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మే 28, జూన్ 12 తేదీల్లో ఆంధ్రా పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

వ్యర్థాల పారవేతకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పీసీబీ ఆదేశించింది. అలాగే పరిశ్రమలో కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలను మరింత సమర్థంగా చేపట్టాలని సూచించింది.

గోదావరిలో వ్యర్థాలను విడుదల చేయడానికి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది.

ADVERTISEMENT