LOADING...
AP Liquor Scam: మద్యం కుంభకోణంలో భారీ నగదు లావాదేవీలు.. నకిలీ ఇన్వాయిస్ల స్వాధీనం
మద్యం కుంభకోణంలో భారీ నగదు లావాదేవీలు.. నకిలీ ఇన్వాయిస్ల స్వాధీనం

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో భారీ నగదు లావాదేవీలు.. నకిలీ ఇన్వాయిస్ల స్వాధీనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ ముఠా మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున లావాదేవీలను విదేశాలకు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన లెడ్జర్లను ED స్వాధీనం చేసుకుంది. దుబాయ్‌కి పారిపోయిన నిందితుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి (A-9) సహా మరికొందరు వ్యక్తుల వద్ద ఈ ముడుపుల సొమ్ము చేరినట్లు నిర్ధారణైంది. ED అధికారులు వివిధ డొల్ల కంపెనీల ప్రతినిధులతో వాట్సప్, టెలిగ్రామ్ చాట్స్‌ వివరాలను సేకరించారు. ఏపీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, రాయ్‌పుర్, ఢిల్లీ, సూరత్‌లలోని 20 ప్రాంతాల్లో గురువారం ED ఏకకాలంలో సోదాలు నిర్వహించి మద్యం ముడుపుల లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ED జోనల్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

Details

పెద్ద ఎత్తున నకిలీ ఇన్వాయిస్ల స్వాధీనం

వైసీపీ ముఠాకు నగదు అందజేసేందుకు డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులు ఆ సొత్తును మొదట బంగారు దుకాణాలు, ప్యాకేజింగ్ సంస్థలు, డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మార్చి, లావాదేవీలను రికార్డ్ చేసేవారు. ఆ ఖాతాల నుంచి డబ్బు వైకాపా ముఠాకు చేరేవిధంగా తీసివ్వబడింది. ED అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున నకిలీ ఇన్వాయిస్లు, వాస్తవ లావాదేవీల కంటే ఎక్కువగా చూపిన ఇన్వాయిస్లు, రవాణేతర వాహనాల చలానాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కార్యాలయ ప్రాంగణం నుంచి రూ.38 లక్షల నగదు EDకు లభించింది.

Details

ముడుపులిస్తేనే ఆర్డర్లు - బెదిరింపు చర్యలు

డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీలకు పాత బిల్లులు చెల్లించకుండా నిలిపి, ముడుపులిస్తేనే ఆర్డర్లు ఇస్తామని బెదిరించారు. ముడుపులు ఇవ్వన డిస్టిలరీలు - మెక్‌డోవల్స్, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లను తొక్కించి, కొత్త మరియు నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. APSBCL నుంచి డిస్టిలరీలకు అందిన సొమ్ములో కొంత భాగాన్ని సేవలు, ముడిసరుకు కొనుగోలు పేరిట వివిధ ఖాతాల్లోకి జమచేసి, వాటిలో కొన్ని ఉనికిలో లేవని ED గుర్తించింది. ED దర్యాప్తులో ఈ డొల్ల కంపెనీల లావాదేవీలు బోగస్‌ అని తేలింది.