NEET Syllabus 2024 : నీట్ నూతన సిలబస్‌ను రిలీజ్ చేసిన ఎన్‌ఎంసీ
దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్‌లో భారీ మార్పులు చేశారు. విద్యార్థులపై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా నూతన సిలబస్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నీట్ 2024 మే5న నిర్వహించనున్నారు. ఇప్పటికే షార్ట్ షెడ్యూల్‌ను కూడా ఎన్‌టీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త సిలబస్ ప్రకారం కెమిస్ట్రి, ఫిజిక్స్‌లలో భారీగా సిలబస్‌ను తగ్గించారు. భౌతిక శాస్త్రంలో ఎక్కువగా కోత విధించగా, కెమెస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో స్వల్పంగా తగ్గించారు. ఇక సిలబస్‌ను ఆలస్యంగా విడుదల చేయడంతో విద్యార్థుల నుంచి భిన్నమైన వాదనలు వినపడుతున్నాయి.
ఫస్ట్ ఈయర్ విద్యార్థులకే అధిక లాభం
సిలబస్ తగ్గింపుతో ప్రస్తుత సెకండియర్ విద్యార్థుల కన్నా, మొదటి సంవత్సరం విద్యార్థులకే ఎక్కవ లాభమని నిపుణులు చెబుతున్నారు. NEET UG సిలబస్‌లో తొలగించిన పాఠ్యాంశాలు ఇవే కెమిస్ట్రీ ఫస్టియర్ పదార్థం స్థితి, హైడ్రోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ సెకండియర్ ఘనస్థితి, ఉపరితల రసాయశాస్త్రం, మెటలర్జీ, రోజువారీ జీవితంలో పాలిమర్లు, కెమిస్ట్రీ. ఫిజిక్స్ ఫస్టియర్ ప్యూర్ రోలింగ్, కనెక్టింగ్ బాడీలు, పాలిట్రోపిక్ ప్రక్రియ, బలవంతమైన, దెబ్బతిన్న డోలనాలు. ఫిజిక్స్ సెకండియర్ పొటెన్షియల్, నాన్ పొటెన్షియల్ సంభావ్యత, ప్రొటెన్షియో మీటర్, ఎర్త్ మ్యాగ్నటిజం, రేడియో యాక్టివిటీ, ట్రాన్సిస్టర్లు, ఆంప్లిప్లయర్లు.
వివిధ సబ్జెక్టులో కుదించిన అంశాలివే..
జువాలజీలో యూనిట్ -2 వానపాములు, యూనిట్-5లో శరీర నిర్మాణశాస్త్రం, జీర్ణక్రియ శోషణం, జ్ఞానేంద్రియాలు (చెవులు, కండ్లు) యూనిట్ -10 జీవావరణం, పర్యావరణం, పర్యావరణ సమస్యలు, పశుసంవర్ధకం. బోటనీ ఫస్టియర్ ప్లాంట్ ఫిజియోలజీలో ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, మార్పొలజీ. బోటనీ సెకండియర్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. బోటనీలో కొత్తగా చేర్చిన అంశాలు బయో మాలిక్యూల్స్, ఎంజైములు, ప్రాపర్టీలు, మాల్వేస్, లెగుమనీస్ సహా మరికొన్ని అంశాలను చేర్చారు.