
Union Budget 2025: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ఆర్థిక సాయం కల్పించడంతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు తెలిపింది. 2024-25 బడ్జెట్‌లో చేసిన ప్రకటనలను, వాటి అమలు స్థితిని వివరించింది. 1. ఏపీ పునర్విభజన చట్ట హామీల అమలు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్లు సమకూరుస్తామని పేర్కొన్నారు. అమలు 'రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం' కింద రూ.3,950.31 కోట్లను ఆమోదించారు. 2024 డిసెంబర్ 24 నాటికి రూ.3,685.31 కోట్లు విడుదల చేశారు. 2015 జూన్ నుంచి ఇప్పటివరకు రూ.35,491.57 కోట్లు విడుదల చేశారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి సుమారు రూ.13,000 కోట్ల ఆర్థిక సాయం అందింది.
Details
2. పోలవరం ప్రాజెక్టు
ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించి త్వరితగతిన పూర్తి చేయిస్తామని తెలిపారు. అమలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,807.69 కోట్లు విడుదల చేశారు. 3. పారిశ్రామిక కారిడార్‌లు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కొప్పర్తి, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఓర్వకల్లు వద్ద నీరు, విద్యుత్, రైల్వే, రహదారుల కోసం అదనపు నిధులు అందిస్తామని ప్రకటించారు.
Details
అమలు
2023 ఆగస్టు 28న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కొప్పర్తి రూ.2,136.51 కోట్లు (భూమి విలువతో కలిపి) కేటాయించారు. ఓర్వకల్లు రూ.2,786.10 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఓర్వకల్లు, కొప్పర్తి పరిధిలో మూడు రహదారి, రెండు రైల్వే ప్రాజెక్టులను గుర్తించారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడలో వెల్దుర్తి-హుస్సేనాపురం, శోలాపుర్-కర్నూలు, కర్నూలు-ఆత్మకూరు రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Details
4. వెనకబడిన జిల్లాల అభివృద్ధి
ప్రకాశం, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. అమలు ఏడు వెనకబడిన (ఉమ్మడి) జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.1,750 కోట్లు విడుదల చేశారు. గత రెండు విడతల్లో రాష్ట్రానికి కేటాయించిన రూ.700 కోట్ల వినియోగ పత్రాలు సమర్పిస్తే, అదనంగా రూ.350 కోట్లు కేటాయిస్తారు.
Details
5. పూర్వోదయ పథకం - తీర ప్రాంత అభివృద్ధి
తూర్పు తీర ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు అమలు తూర్పు తీరంలోని రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక సలహా కమిటీని ఏర్పాటు చేశారు. 45 జిల్లాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, జలవనరులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం 49 పనితీరు సూచికలను రూపొందించారు. 168 ఆకాంక్షిత బ్లాక్‌ల పరిధిలో పథకాలను అమలు చేస్తున్నారు.