
Vijayawada: విజయవాడ ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడలోని ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.కానూరులోని కొత్త ఆటోనగర్ ఆయిల్ ట్యాంకర్ గౌడోన్‌లో ఈ ఘటన జరిగింది.
గోడౌన్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.చుట్టుపక్కల ప్రాంతాలవారు భయందోళన చెంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.
వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారాణాలు,అలానే ఆయిల్ గోడౌన్ కి లైసెన్సు ఉందా లేదా అనే విషయాలను సేకరిస్తున్నారు.
కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఆటోనగర్ వ్యాపార సముదాయాలు ఎక్కువ.ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ట్రాన్స్ పోర్టేషన్ వాహనాలు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆయిల్ ట్యాంకర్ గౌడోన్‌లో అగ్నిప్రమాదం
విజయవాడ ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం https://t.co/GeMIp8eBwU #TeluguAutonagar #Firefighters #Vijayawada
— TeluguStop.com (@telugustop) March 26, 2024