Rahul Gandhi: గ్యాస్ ధరల భారీ పెంపు..ఇది ఎన్నికల బిల్లు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ పెంపును ఆయన 'ఎన్నికల బిల్లు'గా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తదుపరి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కూడా తప్పదని ఆయన హెచ్చరించారు. ఎక్స్ (పూర్వ ట్విట్టర్) వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణ భారం ప్రజలపై పడుతుందని తాను ముందే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అన్నట్లుగానే ఈ రోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.993 పెంచారు. ఇది ఒకే రోజులో భారీ పెంపు. కచ్చితంగా ఇది ఎన్నికల బిల్లు అని విమర్శించారు.
వివరాలు
పెట్రోల్, డీజల్ ధరలు కూడా పెరుగుతాయి