NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
    కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

    మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 20, 2023
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు కొండచరియలు విరిగిపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

    ప్రమాద విషయం తెలియడంతో సీఎం ఏక్ నాథ్ షిండే గురువారం ఉదయం ఘటనా స్థలికి చేరుకున్నారు.వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

    ఘటనా స్థలానికి నేషనల్ డిజాస్టర్ రెస్య్కూ ఫోర్స్ (NDRF)కి చెందిన రెండు బృందాలు చేరుకుని సహాయక చర్యలను వేగం చేశాయి. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ముంబై నుంచి అదనంగా మరో రెండు బృందాలు బయలుదేరాయి.

    ఇర్సల్ వాడి కొండపై ఉన్న గ్రామంలో కొండపై నుంచి మట్టిపెళ్లలు, రాళ్లు నివాసాలపై జారిపడి నిద్రలోనే పలువురు ప్రజలు చనిపోయారు. ప్రమాదంలో పలు ఇళ్లు నేలరాలాయి.

    DETAILS

    ముంబై, రాయ్‌గఢ్, పాల్ఘార్ జిల్లాలకు రెడ్ అలెర్ట్

    రాయ్‌గఢ్‌లో బుధవారం అర్థరాత్రి కొండచరియలు విరిగిపడి దాదాపు 30 కుటుంబాలు చిక్కుకుపోయాయి. కాగా ఇప్పటి వరకు దాదాపు 75కిపైగా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    ప్రస్తుతం 100 మందికిపైగా NDRF, నేవీ, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ప్రధాన నదులు సావిత్రి, పాతాళగంగ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

    మరోవైపు కుండలికా, అంబా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గాధి, ఉల్లాస్ నదులు డేంజర్ మార్క్ కు చేరువలో ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

    భారీ వర్షాల కారణంగా ముంబైలోని అన్ని విద్యాసంస్థలకు గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముంబై, రాయ్‌గఢ్, పాల్ఘార్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ముంబై
    వరదలు
    భారీ వర్షాలు

    తాజా

    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్
    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య

    మహారాష్ట్ర

    ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి ఏక్‌నాథ్ షిండే
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  నాగపూర్
    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి  బస్
    మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత  ఏక్‌నాథ్ షిండే

    ముంబై

    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు మహారాష్ట్ర
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్
    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ

    భారీ వర్షాలు

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  ఉత్తరాఖండ్
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు తెలంగాణ
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025