Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఒకే ఏడాదిలో సైబర్ నేరగాళ్లు రూ. 1,229 కోట్లను దోచుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
2024లో పోలీసులకు 7,23,378 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు, ఇది రికార్డుగా నిలిచింది. ఈ ఏడాదిలో సగటున రోజుకు సైబర్ నేరగాళ్లు రూ. 3.36 కోట్లను దోచుకున్నట్లు డీజీపీ వివరించారు.
2023లో 4,74,391 ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరాలు జరిగి, 682 కేసుల్లో రూ. 173 కోట్ల నష్టాన్ని బాధితులు అనుభవించారు.
2024లో ఫిర్యాదుల సంఖ్య 52.4 శాతం పెరిగింది. బాధితులు 610 శాతం ఎక్కువ సొత్తును కోల్పోయారు.
Details
గంజాయి కేసులు అధికం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి, మాదకద్రవ్యాలపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నా గంజాయి కేసులు గత కాలం కన్నా ఎక్కువగా నమోదయ్యాయి.
మొత్తం నేరాలపై గతేడాది 97,760 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 92,094 కేసులకు పరిమితమైంది.
హత్యలు, హత్యాయత్నాల కేసులు తగ్గినప్పటికీ, లాభం కోసం హత్యలు, దోపిడీలు, మరియు పగలు, రాత్రి వేళల్లో ఇళ్లలో దోంగతనాలు ఎక్కువగా జరిగాయి.
మహిళల హత్యలు పెరిగినా, అత్యాచారాలు, వరకట్న చావులు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు గణనీయంగా తగ్గాయి.
2023లో ఆంధ్రప్రదేశ్‌లో 18,597 రోడ్డు ప్రమాదాల్లో 8,136 మంది మరణించగా, 20,977 మంది గాయపడ్డారు. 2024లో 17,688 రోడ్డు ప్రమాదాల్లో 7,863 మంది మరణించగా, 19,711 మంది గాయపడ్డారు.