తదుపరి వార్తా కథనం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రానున్న 3 రోజుల్లో వానలే వానలు
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Sep 01, 2023
03:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలకు, భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 3 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనుంది.
పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఆవర్తనంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.
పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఈనెల 4 వరకు వాయవ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.
సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ అంతటా భారీ వర్షాలు
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 1, 2023