కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో పోస్ట్ పోల్ సర్వేల ఆధారంగా పలు సంస్థలు బుధవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈసారి కూడా కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని తెలిపాయి. అయితే అత్యధిక సీట్లతో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చేశాయి . కర్ణాటకలో 38ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. దీంతో అదే సంప్రదాయాన్ని ఈ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని మెజార్టీ ఓటర్లు నిర్ణయించినట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 224అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా113 సీట్లు కావాలి.
టీవీ9 భారత్ వర్ష్ - పోల్ స్టార్ట్ సర్వే
భారతీయ జనతా పార్టీ 88-98 సీట్లు కాంగ్రెస్ 99-109 సీట్లు జేడీఎస్ 21-26సీట్లు ఇతరులు 0-4 సీట్లు రిపబ్లిక్ -పీ -మార్క్ భారతీయ జనతా పార్టీ 85-100 సీట్లు కాంగ్రెస్ 94-108 సీట్లు జేడీఎస్ 24-32సీట్లు ఇతరులు 2-4 సీట్లు
ఏబీపీ సీ ఓటర్ సర్వే
భారతీయ జనతా పార్టీ 83-95సీట్లు కాంగ్రెస్ 100-112సీట్లు జేడీఎస్ 21-29సీట్లు ఇతరులు 2-6 సీట్లు ఏసియానెట్ సువర్ న్యూస్ -జన్ కీ బాత్ భారతీయ జనతా పార్టీ 94-1117 సీట్లు కాంగ్రెస్ 91-106సీట్లు జేడీఎస్ 14-24సీట్లు ఇతరులు 0-2సీట్లు