LOADING...
UP: అన్నంలో విషం కలిపి భర్త హత్య.. యూపీలో ప్రేమ పిశాచినీ చేష్టలు!
అన్నంలో విషం కలిపి భర్త హత్య.. యూపీలో ప్రేమ పిశాచినీ చేష్టలు!

UP: అన్నంలో విషం కలిపి భర్త హత్య.. యూపీలో ప్రేమ పిశాచినీ చేష్టలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఇటీవల మహిళల క్రూర చర్యలు కలకలం రేపుతున్నాయి. ప్రేమ పేరుతో భర్తలను హత్య చేయడం, వారి సొంత జీవితం కోసం కట్టుకున్న వారిని బలితీసే తీసే ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మీరట్‌లో డ్రమ్ములో భర్తను దాచి సిమెంట్ వేసిన సంఘటన మరవకముందే.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Details

 వివాహేతర సంబంధం.. భర్తపై కుట్ర 

ఫిరోజాబాద్‌ జిల్లా ఉలావ్ గ్రామానికి చెందిన సునీల్, శశిదేవి దంపతులుగా జీవిస్తున్నారు. అయితే శశిదేవికి యాదవేంద్ర అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఆడ్డు అవుతాడనే ఉద్దేశంతో ప్రియుడి సహాయంతో ఆమె భర్తను మట్టుబెట్టే కుట్ర వేసింది. ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ మే 13న శశిదేవి తన భర్తకు పెరుగులో విషం కలిపి ఇచ్చింది. విషం ప్రభావంతో సునీల్ మృతి చెందగా, ఇది సహజ మరణంగా నమ్మించడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమె అనుచిత ప్రవర్తనపై అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు జూలై23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన తర్వాత నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. ప్రేమికుడి సాయంతో ఆన్‌లైన్‌లో విషాన్ని తెప్పించి భర్తను హత్య చేసినట్లు తెలిపింది.

Details

12 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు

శశిదేవి, యాదవేంద్ర ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇద్దరూ వివాహితులే కాగా, చాలా కాలంగా సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. శశి, సునీల్‌లకు 12 ఏళ్ల వివాహ జీవితం ఉన్నప్పటికీ.. అది చివరకు విషాదాంతం కావడం బాధాకరం.