LOADING...
Hyderabad: పండగపూట విషాదం.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి 
Hyderabad: పండగపూట విషాదం.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి

Hyderabad: పండగపూట విషాదం.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Jan 16, 2024
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పండుగ వేళ.. హైదరాబాద్‌లో గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు గాలిపటాలు ఎగురవేస్తూ నగరంలో ఏడుగురు చనిపోగా.. తాజాగా మరో ఇద్దరు యువకుడు మరణించడం బాధాకరం. రహ్మత్ నగర్‌లో తన స్నేహితులతో చౌహాన్ శ్రీదేవ్‌(21)అనే యువకుడు గాలిపటాలు ఎగిరేస్తున్న క్రమంలో ఐదంతస్తుల భవనంపై నుంచి కింద పడి చనిపోయాడు. చౌహాన్ శ్రీదేవ్‌ మృతి విషయంలో స్నేహితులపై అనుమనం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే, నగరంలోని యాప్రాల్‌లో గాలిపటం ఎగరవేస్తూ భువన్ సాయి అనే బాలుడు బిల్డింగ్ నుంచి కిందపడి చనిపోయాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నగరంలో విషాదం