
Hyderabad: పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ((40)ని కిరాతకంగా హత్య చేశారు.
తారిక్ అలీని బాబా ఖాన్ అని కూడా పిలుస్తుంటారు. రామచంద్రనగర్‌లో బాబా ఖాన్ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం అర్ధరాత్రి ఇంటి బయట కూర్చున్న బాబా ఖాన్‌పై ప్రత్యర్థులు విచక్షణ రహితంగా కత్తులతో పొడిచారు.
ఈ దాడిలో బాబా ఖాన్ తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హత్య
నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
హత్య విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మనోహర్, చాంద్రాయణగుట్ట ఏసీపీ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు.
ఆ తర్వాత బాబా ఖాన్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కాగా.. వాటి ఆధారంగా పోలీసులు నిందితులను గాలిస్తున్నారు.