High speed rail: హైదరాబాద్-బెంగళూరు ప్రయాణం 2 గంటలు మాత్రమే : : అశ్వినీ వైష్ణవ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 02, 2026
05:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైస్పీడ్ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం వేగవంతంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2026-27 బడ్జెట్‌లో తెలంగాణ రైల్వేకు రూ.5,454 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. మంత్రి వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి చెన్నై, పుణె, బెంగళూరు వరకు మూడు హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. ఈ రైళ్లు గంటకు 350 కి.మీ వేగంతో నడుస్తాయి. దీని ఫలితంగా హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణం కేవలం 2 గంటల్లో హైదరాబాద్-పుణె 1.55 గంటల్లో, హైదరాబాద్-చెన్నై 2.55 గంటల్లో పూర్తి చేయవచ్చు. హైస్పీడ్ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గేమ్-చేంజర్‌గా మారి, వ్యాపార, పర్యాటక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.