హైదరాబాద్ హై'టెక్' పోలీస్: సైబర్ యూనిట్ బలోపేతానికి 'ఏఐ' సపోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను మరింత మెరుగు పర్చేందుకు నగర పోలీసులు ఈ ఏడాది ప్రత్యేక కార్యచరణతో ముందుకుపోతున్నారు. అధునాత టెక్నాలజీ సాయంతో రాజధానిని హైటెక్ నరగంగా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవనంలో అన్ని విభాగాల పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ కార్యాచరణను వివరించారు.
నగరంలో డ్రగ్ రవాణా, సైబర్‌క్రైమ్, మహిళల భద్రతతో పాటు నేరాల నివారణ, గుర్తింపు, పెండెన్సీ క్లియరెన్స్‌లు, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం వంటి సాధారణ అంశాలపై దృష్టి సారించాలని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.
సైబర్ క్రైమ్ వింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ఇన్వెస్టిగేటివ్ సపోర్ట్ సెంటర్‌ను స్థాపించడం, ఇన్వెస్టిగేషన్‌లో స్టేషన్ సిబ్బందికి సాయం చేసేలా హైదరాబాద్ పోలీస్ విభాగం ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
సీపీ
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కొనుగోళ్లకు అనుమతులు
టెక్నాలజీని బలోపేతం చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కొనుగోళ్లకు ఇటీవల అనుమతులు వచ్చినట్లు సీపీ ఆనంద్ చెప్పారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోనున్నట్లు వివరించారు. నెలాఖరులోగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో ఏడీసీ అమలు చేయాలని అన్ని జోనల్ డీసీపీలను సీవీ ఆనంద్ కోరారు.
చాట్ బాట్‌ల వినియోగం, డిజిటల్ లైబ్రరీ నిర్వహణ, గ్రేటర్ ఫైనాన్సింగ్, పోలీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్ వంటి అనేక లక్ష్యాలతో ముందుకుపోతున్నట్లు పేర్కొన్నారు.
ఒకే తేదీల్లో వివిధ మతపరమైన పండగలు, ఊరేగింపులు వస్తే.. మానవ సంబంధాలను బలోపేతం చేయడం కోసం.. యువతతో శాంతి కమిటీలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని చెప్పారు. సీనియర్ అధికారులందరూ తమ ప్రత్యేక విభాగాల్లో ముందుండి నడిపించాలని ఈ సందర్భంగా సీపీ సూచించారు.