NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Revanth Delhi Tour: మెట్రో ఫేజ్​2కు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
    తదుపరి వార్తా కథనం
    CM Revanth Delhi Tour: మెట్రో ఫేజ్​2కు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
    మెట్రో ఫేజ్​2కు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    CM Revanth Delhi Tour: మెట్రో ఫేజ్​2కు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 08, 2024
    03:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో, మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకరించాలని కోరారు.

    ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను త్వరలో సమర్పిస్తామని తెలిపారు.

    అలాగే, హైదరాబాద్‌కు సంబంధించిన సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ (సీఎస్‌ఎంపీ)ను పూర్తి చేయడంలో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

    అమృత 2.0 ప్రోగ్రాంలో ఈ సీఎస్‌ఎంపీని చేర్చడం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులు కేటాయించాలని కోరారు.

    సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఈ విషయమై ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

    వివరాలు 

    మున్సిపాలిటీలలో 100శాతం ద్రవ వ్యర్థాలను శుద్ధి చేయాల్సిన అవసరం: రేవంత్ 

    ఈ సమావేశంలో ఎంపీలు గడ్డం వంశీకృష్ణ,రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ దాన్ కిశోర్,హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.

    సమావేశంలో, సీఎం రేవంత్ కేంద్ర మంత్రికి హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థ ఉంది, ఇది ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదని వివరించారు.

    హైదరాబాద్ సమీప మున్సిపాలిటీలలో కూడా సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని ఆయన పేర్కొన్నారు.

    హైదరాబాద్‌లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచస్థాయి నగరాల్లాగా ఉండాలంటే,నగరం,సమీప మున్సిపాలిటీలలో 100శాతం ద్రవ వ్యర్థాలను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

    వివరాలు 

    మూసీ సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల డీపీఆర్ కూడా.. 

    ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌తో పాటు 27 సమీప మున్సిపాలిటీలను కవర్ చేస్తూ 7,444 కిలోమీటర్ల మేర రూ.17,212.69 కోట్లతో రూపొందించిన సీఎస్‌ఎంపీ డీపీఆర్‌ను ఖట్టర్‌కు అందజేశారు.

    హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తున్నదని, ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర నగరంలోని మురుగు అంతా మూసీలో చేరుతున్నదని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు రేవంత్ రెడ్డి వివరించారు.

    ఇలా మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్ మెయిన్స్,లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్ రూపొందించినట్టు తెలిపారు.

    ఆ డీపీఆర్‌ను కూడా కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు.

    వివరాలు 

    మెట్రో ఫేజ్-2 కార్యరూపం దాల్చేలా చూడండి 

    దాన్ని ఆమోదించడానికి, పనుల అనుమతికి చొరవ చూపాలని కేంద్ర మంత్రినిఅభ్యర్థించారు.

    హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్-శంషాబాద్-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (36.8 కి.మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్తయ్యాయని ఖట్టర్‌కు రేవంత్ తెలిపారు.

    ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

    దీనిని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం 50:50 రేషియోలో జాయింట్ వెంచర్‌గా చేపట్టాలనుకుంటున్నామని సీఎంను తెలిపారు.

    త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పిస్తామన్నారు, తద్వారా ప్రాజెక్ట్ త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని రేవంత్ కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    మనోహర్ లాల్ ఖట్టర్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    రేవంత్ రెడ్డి

    TG Panchayat Elections: తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లకు షెడ్యూల్ ఖరారు  తెలంగాణ
    Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం తెలంగాణ
    Revanth Reddy : 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్
    CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన తెలంగాణ

    మనోహర్ లాల్ ఖట్టర్

    Gurugram violence: హర్యానాలో 116మంది అరెస్టు; హింస వ్యాపించకుండా దిల్లీ అప్రమత్తం  హర్యానా
    రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్  హర్యానా
    ఉపాధి కోసం ఫ్యాక్టరీ అడిగితే.. చంద్రయాన్-4 ద్వారా పైకి పంపిస్తామన్న సీఎం హర్యానా
    Manohar Lal Khattar: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025