Hyderabad: మూసారాంబాగ్ వద్ద మూసీపై పాత వంతెన కూల్చివేత.. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
మూసీ నదిపై మూసారాంబాగ్ ప్రాంతంలో ఉన్న పాత వంతెనను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇటీవల జరిగిన మూసీ వరదల కారణంగా ఈ వంతెనకు తీవ్ర నష్టాలు ఏర్పడి, రవాణాకు సురక్షితంగా ఉండకపోవడంతో గత కొన్ని రోజులుగా వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. వరదల ప్రభావంతో వంతెనకు క్రాక్స్ రావడం, రెయిలింగ్ పెచ్చులూడి పోవడం, అక్కడక్కడా ఇనుపరాడ్లు తేలి ప్రమాదకర స్థితిలో ఉండటంతో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం సమగ్ర పరిశీలన అనంతరం వంతెనను పూర్తిగా మూసివేశారు.
వివరాలు
గోల్నాక వంతెన ద్వారా వాహనాలను దారి మళ్లింపు
ట్రాఫిక్ పోలీసులు కూడా వంతెనపై వాహన రాకపోకలకు అనుమతులు నిలిపివేశారు. ఈ ప్రక్రియలో ముందస్తుగా ఏవైనా ప్రమాదాలు సంభవించకుండా వంతెనను సురక్షితంగా కూల్చివేస్తున్నారు. పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అంబర్ పేట వైపు ప్రయాణించే వాహనాలను గోల్నాక వంతెన ద్వారా దారి మళ్లించారు. అయితే, పాత వంతెన కూల్చివేత కారణంగా కాలినడక వెళ్లే పాదచారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు, పాత వంతెన తొలగింపు పనులు కొత్త వంతెన పూర్తయిన తర్వాత మాత్రమే జరగాలని కోరుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మూసారాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జి కూల్చి వేస్తున్నGHMC
మూసారాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జి కూల్చి వేస్తున్నGHMC pic.twitter.com/nLwgikzEoV
— V6 News (@V6News) October 23, 2025