Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు.. నామినేషన్లను ఉపసంహరించుకున్న 23 మంది
ఈ వార్తాకథనం ఏంటి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీపడనున్న అభ్యర్థుల తుది జాబితా ఖరారయింది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, 81 మంది మాత్రమే అర్హత పొందారు. వీరిలో వివిధ పార్టీలు, పలువురు స్వతంత్రులు మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా, 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఇంత మంది అభ్యర్థులు పోటీపడడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి.
వివరాలు
మాగంటి గోపీనాథ్ మరణంతో ఈసారి ఉపఎన్నిక
గత ఎన్నికలలో ఈ సంఖ్య ఇలా ఉంది: 2009: 13 మంది 2014: 21 మంది 2018: 18 మంది 2023: 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఈసారి ఉపఎన్నిక జరిగింది. ప్రధాన పార్టీలు మాత్రమే కాదు, పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి నాయకులు, రైతులు కూడా ఈసారి బరిలోకి దిగారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ వరకు ఉత్కంఠ కొనసాగుతూ, చివరకు 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
వివరాలు
భారీగా నామినేషన్లు ఎందుకంటే..?
పలువురు అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను తమ ఉద్యమ వేదికగా ఉపయోగిస్తూ, తమ సమస్యలను పబ్లిక్ ఫోకస్‌కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ కారణాలను చూపిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలుకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.5, ఇతరులు రూ.10 వేలు చెల్లించిమరీ నామినేషన్లు వేశారు. ప్రాంతీయ రింగు రోడ్ భూసేకరణ నిర్వాసితులు: ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయం కోరుతూ 12 మంది
వివరాలు
నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది నామినేషన్లు
యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు: 10 మంది, భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక సామాజిక వర్గం తరఫున 10 మంది నామినేషన్ వేశారు. ఉద్యోగ నియామకాల ప్రకటనలు లేవని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది నామినేషన్లు సమర్పించారు. పెన్షన్ల సమస్య: సీనియర్ సిటిజన్ల తరఫున 9 మంది తెలంగాణ ఉద్యమకారులు . తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒకరు సమర్పించారు.