LOADING...
Hyderabad: పీఆర్టీ సేవల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం.. 
పీఆర్టీ సేవల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..

Hyderabad: పీఆర్టీ సేవల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎక్కువైందని భావిస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో పనిచేస్తున్న యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఉమ్టా) ఇప్పటికే ఈ విషయంలో అధ్యయనాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న పర్సనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ (పీఆర్టీ) విధానాన్ని ప్రజారవాణా కోసం అమలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న బాక్స్‌లా కనిపించే ఈ పీఆర్టీ వాహనాల్లో 4 నుండి 6 మంది ప్రయాణికులు తమ లగేజీతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇవి డ్రైవర్‌ అవసరం లేకుండా పూర్తిగా ఆటోమేటిక్‌ వ్యవస్థతో నడుస్తాయి. బ్యాటరీ ఆధారితంగా పనిచేసే కారణంగా వాయు కాలుష్యం కలిగించే అవకాశం లేదు.

వివరాలు 

భూసేకరణ లేకుండానే..:

రోజుకు సుమారుగా రెండు లక్షల మంది వరకు వీటి సహాయంతో దగ్గర ప్రాంతాలకు ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్ల మధ్యలో లేకపోతే రోడ్లకు ఇరువైపులా పీఆర్టీ సర్వీసులను ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశీలనలు సాగుతున్నాయి. అధ్యయనం జరుగుతున్న మార్గాల్లో, రోడ్లకు ఇరువైపులా అవసరమైన స్థలం లభించటం ఈ ప్రాజెక్ట్‌ అమలుకు అనుకూలంగా మారుతోందని అధికారులు తెలిపారు.

వివరాలు 

పీఆర్టీ సర్వీసుల ఏర్పాటుకు గతంలో పరిశీలించిన మార్గాలు 

ఎక్కడి నుంచి ఎక్కడికంటే.. రాయదుర్గ్‌ మెట్రో స్టేషన్‌ - నాలెడ్జ్‌ సిటీ రాయదుర్గ్‌ మెట్రో స్టేషన్‌ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాచిగూడ-ఎంజీబీఎస్‌-జూపార్కు-ఎయిర్‌పోర్టు