
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్ మేనేజర్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగరంలో నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఓ వైపు, దొంగతనాలు మరోవైపు తరచుగా జరుగుతుండటంతో నగర వాసులు బెంబెలిత్తిపోతున్నారు.
తాజాగా బల్దియా పరిధిలో ఘోర హత్య చోటు చేసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. ఓ రెస్టారెంట్ మేనేజర్ పై జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కోల్‌కతాకు చెందిన దేవేందర్ గాయన్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
మదీనగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో దేవేందర్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు జీఎం దేవేందర్‌పై దాదాపు ఐదు రౌండ్ల మేర విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
details
పాతకక్షలతోనే దేవేందర్ హత్య జరిగి ఉండొచ్చు : పోలీసులు
దీంతో ఆయన అక్కడికక్కడే కూలిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంతకుముందే కాల్పుల ఘటన తర్వాత నిందితులు పరారయ్యారు.
సమాచారం అందుకున్న మాదాపూర్ డీసీపీ, మియాపూర్ పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కాల్పుల ఘటనతో పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పాతకక్షలతోనే దేవేందర్‌ను హత్య జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఈ నేపథ్యంలోనే దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ రావు వెల్లడించారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.