Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటన చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఢీకొట్టిన టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సుపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు బస్సులో ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇంకా పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాలు
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
ప్రాథమిక వివరాల ప్రకారం, ఆర్టీసీ బస్సు తాండూరు నుండి హైదరాబాద్ దిశగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని తెలిసింది. వీరిలో కొందరు హైదరాబాద్‌లోని వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులుగా గుర్తించారు. ఆదివారం సెలవు కావడంతో వారు తమ గ్రామాలకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే, ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బస్సును ఢీకొట్టిన టిప్పర్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
— DONTHU RAMESH (@DonthuRamesh) November 3, 2025
బస్సును ఢీకొట్టిన టిప్పర్
10 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం, పలువురికి తీవ్ర గాయాలు
బస్సులో 70 మంది ప్రయాణికులు
చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ప్రమాదం
చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్
చేవెళ్ల… pic.twitter.com/B73NuAkNzp