LOADING...
CA Top Ranker 2025: సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్‌ కుర్రాడికి ఆల్‌ ఇండయా సెకండ్‌ ర్యాంకు!
సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్‌ కుర్రాడికి ఆల్‌ ఇండయా సెకండ్‌ ర్యాంకు!

CA Top Ranker 2025: సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్‌ కుర్రాడికి ఆల్‌ ఇండయా సెకండ్‌ ర్యాంకు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తాజాగా సీఏ ఫైనల్ ఫలితాలను ప్రకటించింది. ఫౌండేషన్, ఇంటర్మీడియేట్, ఫైనల్‌ కోర్సుల ఫలితాలు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. 2025 సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం కంటే స్వల్పంగా పెరిగిందని ICAI అధికారులు వెల్లడించారు.

వివరాలు 

 తేజస్‌ తండ్రి, సోదరుడు కూడా సీఏలే

తాజా ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన తేజస్‌ ముందాడ అద్భుత విజయాన్ని సాధించాడు. జాతీయ స్థాయిలో తేజస్‌ ఆల్ ఇండియా రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌ పరీక్షల్లో ఆయన 600 మార్కుల్లో 492 మార్కులు సాధించి, సగటున 82 శాతం స్కోర్‌ నమోదు చేశాడు. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన ఫౌండేషన్‌, ఇంటర్మీడియేట్‌, ఫైనల్‌ పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 1,01,028 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 11,466 మంది ఉత్తీర్ణత సాధించారు.ఇదే కాకుండా, తేజస్‌ గతంలో సీఏ ఇంటర్మీడియేట్‌ పరీక్షల్లో ఆల్ ఇండియా 5వ ర్యాంక్‌ పొందాడు. తేజస్‌ తండ్రి, సోదరుడు కూడా సీఏలే.

వివరాలు 

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై ప్రత్యేక కమిటీ

ఇక మరోవైపు, తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యపై ఇప్పటికే ప్రైవేట్‌ కాలేజీలు బంద్‌ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిని పరిగణలోకి తీసుకున్న రేవంత్‌ ప్రభుత్వం,విధానం సమీక్ష కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీఓను ప్రభుత్వం గత నెల 28న విడుదల చేసింది కానీ తాజాగా దీనిపై వివరాలు వెల్లడించింది.

వివరాలు 

మూడు నెలల్లో నివేదిక 

కమిటీకి సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌ ను చైర్మన్‌గా నియమించగా, ప్రొఫెసర్‌ కోదండరాం, కంచ ఐలయ్య, అలాగే ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ఉన్నత విద్యాసంస్థల నుంచి మరో ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై సమగ్ర నివేదికను మూడు నెలల్లో సమర్పించాల్సి ఉంటుంది. అదనంగా, విద్యా సంస్థలు సూచించిన అంశాలను కూడా కమిటీ పరిశీలించనుంది.