Terror Attack: ఉగ్రదాడులకు కుట్రపన్నిన హైదరాబాదీ అరెస్ట్..!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులు నిర్వహించడానికి కుట్రపన్నిన ముగ్గురు వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. ఈ ముఠా దేశంలో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురినీ గుజరాత్ రాష్ట్రంలోని ఒక టోల్ ప్లాజా సమీపంలో ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురిలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (Syed Ahmed Mohiuddin) ఉండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మిగతా ఇద్దరు వ్యక్తులు మొహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫ్ అని అధికారులు గుర్తించారు.
Details
లోతుగా విచారణ చేస్తున్న అధికారులు
ఏటీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురు గత ఏడాదీ కాలంగా ఏటీఎస్ నిఘాలో ఉండేవారు. వారు దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు చేసేందుకు కుట్రపన్నుతూ, దానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడిన వ్యక్తులపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల వివరాలను ఏటీఎస్ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది