
Kondapur Demolitions: హైడ్రా సంచలన వ్యాఖ్యలు.. హైకోర్టు కోర్టు తీర్పుతోనే కూల్చివేతలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని కొండపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై ఏర్పడిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. దాదాపు 36 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఇది సుమారుగా రూ. 3600 కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో సర్వే నంబర్ 59లో కొంతమంది భూకబ్జా చేసినట్లు హైడ్రా తెలిపింది. గతంలో ఈ భూమిపై రైతులకు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది.
Details
36 ఎకరాలు ప్రభుత్వానికే
అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. తర్వాత హైకోర్టు రేవంత్ సర్కార్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఆ 36 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందినదేనని స్పష్టత ఇచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ 4న ఉదయం నుంచి కొండాపూర్ బిక్షపతి నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టింది. తాత్కాలిక షెడ్డులు ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీచేశారు.