LOADING...
Suvendu Adhikari: 'సువేందు అధికారి అనే నేను'.. బెంగాల్‌లో తొలిసారి కమలం వికాసం!
'సువేందు అధికారి అనే నేను'.. బెంగాల్‌లో తొలిసారి కమలం వికాసం!

Suvendu Adhikari: 'సువేందు అధికారి అనే నేను'.. బెంగాల్‌లో తొలిసారి కమలం వికాసం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2026
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, ఆమెకు 'కుడి భుజం'గా పేరుగాంచిన సువేందు అధికారి.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో బీజేపీ తరఫున బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి సువేందు అధికారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర మంత్రిమండలిలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.'

వివరాలు

కాషాయ రంగు కుర్తా ధరించి కార్యక్రమానికి హాజరు

ముఖ్యంగా, మమతా బెనర్జీ ధరించే సాదాసీదా తెల్ల చీర, రబ్బరు చెప్పుల మాదిరిగానే.. సువేందు అధికారి కూడా అత్యంత నిరాడంబరంగా కాషాయ రంగు కుర్తా ధరించి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు అగ్నిమిత్ర పాల్, నిసిత్ ప్రామాణిక్, దిలీప్ ఘోష్, శంకర్ ఘోష్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ విజయం బీజేపీకి ఎంత ప్రాధాన్యమో తెలియజేసేలా ప్రధానితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలం కావడంతో బెంగాల్‌లో అధికారాన్ని చేపట్టడాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మే 9 తేదీని ఎంచుకోవడం వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు

ల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

ఆ రోజు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కావడం విశేషం. బీజేపీని 'ఉత్తర భారత పార్టీ'గా విమర్శిస్తూ, బెంగాలీ సంస్కృతిని గౌరవించదని టీఎంసీ చేసే ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఈ తేదీని ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. ఇక సభా ప్రాంగణాన్ని కూడా బెంగాలీ సంస్కృతికి ప్రతిబింబంగా తీర్చిదిద్దారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదిక సమీపంలో దాదాపు 20 రకాల స్వీట్ల స్టాళ్లతో పాటు బెంగాల్‌కు ప్రత్యేకమైన 'ఝల్మురీ' స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్‌లో ఝర్‌గ్రామ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ అనూహ్యంగా ఆగి ఝల్మురీ రుచి చూడటంతో ఈ వంటకానికి విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement