Page Loader
బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్
బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్

బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్

వ్రాసిన వారు Stalin
Apr 18, 2023
06:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగదీష్ షెట్టర్ ఇటీవల బీజేపీని వీడి, కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీని వీడటం వెనుక బీఎల్ సంతోష్ ఉన్నారని ఆరోపించారు. బీఎల్ సంతోష్ తనపై కుట్ర పన్నారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడం ద్వారా తనను అవమానించారని పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ షెట్టర్, ప్రతిపక్ష నేతగా, స్పీకర్‌గా, పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడంతో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు.

కర్ణాటక

మంత్రి పదవిని కోల్పోయినా పార్టీకోసం పని చేశా: శెట్టర్ 

బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంలో తాను మంత్రి పదవిని కోల్పోయినప్పటికీ పార్టీ కోసం కష్టపడి పని చేసినట్లు గుర్తు చేశారు. మహేష్ టెంగింకై‌కు టికెట్ ఇచ్చేందుకు బీఎల్ సంతోష్‌ తనను బలి చేసినట్లు శెట్టర్ ఆరోపించారు. మైసూరు జిల్లా కృష్ణరాజ అసెంబ్లీ సెగ్మెంట్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్‌ఏ రామదాస్‌ను కాదని, కొత్త ముఖమైన శ్రీవత్సకు టికెట్ టికెట్ ఇచ్చారన్నారు. రామదాస్‌ బీఎల్‌ సంతోష్‌ విధేయుడు కాదనే కారణంతోనే ఆయనకు టికెట్ ఇవ్వలేదన్నారు. బీఎల్ సంతోష్‌కు కేరళ ఇన్‌ఛార్జ్‌గా ఇచ్చి ఒక్క సీటు కూడా గెలవలేదని శెట్టర్ గుర్తు చేశారు.