LOADING...
Kavitha: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సహకరిస్తా.. సిట్‌ పిలిస్తే హాజరవుతా: కవిత
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సహకరిస్తా.. సిట్‌ పిలిస్తే హాజరవుతా: కవిత

Kavitha: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సహకరిస్తా.. సిట్‌ పిలిస్తే హాజరవుతా: కవిత

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ఇంకా ముగింపునకు రాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణను త్వరితగతిన పూర్తి చేసి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, సిట్‌ విచారణలో వాస్తవంగా ఏం జరిగిందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడిస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

Details

కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవికావు

ఈ సందర్భంగా సిట్‌ విచారణను విమర్శిస్తూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవికావని కవిత స్పష్టం చేశారు. చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గుంట నక్కలతో కలిసి డ్రామాలు ఆడుతోందని ఆమె ఆరోపించారు. తనతో పాటు తన భర్త ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారనే అనుమానాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. ఈ కేసులో సిట్‌ అధికారులు విచారణకు పిలిస్తే తాను తప్పకుండా హాజరై పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు.

Advertisement