
IAF Chief: బాలీవుడ్ పాటకు ఐఏఎఫ్ చీఫ్ స్టెప్పులు… వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ సాంగ్ 'హవన్ కరేంగే'కు భారత వైమానిక దళం (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Air Chief Marshal Amar Preet Singh) డాన్స్ స్టెప్పులు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే వాయుసేన చీఫ్ ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న వీడియోని చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు సరదాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌లోని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన ఆనందంలో ఎయిర్ చీఫ్ మార్షల్ నృత్యం చేస్తున్నారంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Details
అపరేషన్ సింధూర్ దాడుల్లో ముఖ్య పాత్ర
వీడియో ఏ సందర్భంలో చిత్రీకరించబడిందో ఇంకా తెలియలేదు. గతంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులు నిర్వహించింది. ఈ వ్యూహాత్మక దాడుల్లో ముఖ్య పాత్ర ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ పోషించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వంలో పాక్‌పై దాడులను స్వయంగా పర్యవేక్షించిన ఆయన, ఆపరేషన్ కోసం అవసరమైన పైలట్లను సొంతంగా ఎంపిక చేసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే
IAF Chief Amar Preet Singh after destroying 11 Air bases and multiple fighter jets of Pakistan pic.twitter.com/jNLGQbQDfV
— sumit jha (@sumitjh66117264) September 28, 2025