LOADING...
Assam:అస్సాంలో కూలిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి
అస్సాంలో కూలిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి

Assam:అస్సాంలో కూలిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

వాయుసేనకు చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం ఇటీవల గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విమానం కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదం అస్సాం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ యుద్ధవిమానం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. అదే సమయంలో రాడార్‌తో ఉన్న సంబంధాలు కూడా తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.అనంతరం జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి సుమారు 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయినట్లు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జోర్హాట్‌ నుంచి బయలుదేరిన యుద్ధవిమానం విషాదాంతం 

Advertisement