ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు గాయాలతో ప్రాణాలతో బయటపడగా, మరో పైలెట్ కోసం వెతుకున్నట్లు అధికారులు తెలిపారు.
వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి సమాచారం అందించారు. ప్రమాదం గురించి వివరించారు. ఈ సందర్భగా పైలెట్ల యోగక్షేమాలను రాజ్‌నాథ్ అడిగినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
గ్వాలియర్ ఎయిర్ బేస్‌లో శిక్షణ సమయంలో తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు మోరీనా కలెక్టర్ తెలిపారు. సుఖోయ్-30 నుంచి ఇద్దరు పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పారు.
మధ్యప్రదేశ్
విమానాలు కూలిపోవడంపై విచారణకు ఆదేశించిన ఐఏఎఫ్
సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కుప్పకూలిన ఘటనపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది. రెండు విమానాలు పరస్పరం గాలిలో ఢీకొన్నాయా? లేదా? కుప్పకూలడానికి కారణం ఏమై ఉంటుందనే విషయం విచారణలో తేలనుంది.
ప్రమాదం జరిగినప్పుడు సుఖోయ్-30 ఇద్దరు ఇద్దరు పైలట్లు ఉండగా, మిరాజ్ 2000లో ఒక పైలట్ ఉన్నారు. సుఖోయ్-30లోని ఇద్దరు ఇద్దరు పైలట్లు ఇప్పటికే సురక్షితంగా బయటపడగా, త్వరలో 3వ పైలట్ ఉన్న ప్రదేశానికి చేరుకుంటామని రక్షణ వర్గాలు తెలిపాయి.
మోరెనాలో నేలపై పడి ఉన్న విమాన శిథిలాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.