Page Loader
Andhra Pradesh: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Andhra Pradesh: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2024
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సురేష్‌కుమార్‌, సాల్మన్‌ ఆరోక్యరాజ్‌లకు పదోన్నతిని అందజేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కు చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పించగా, సురేష్‌కుమార్‌ను పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సాల్మన్‌ ఆరోక్యరాజ్‌ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.

వివరాలు 

కార్తికేయ మిశ్రాకు సీఎంవోలో కార్యదర్శిగా పదోన్నతి

2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్‌, సీహెచ్‌ శ్రీధర్‌లకు కార్యదర్శి హోదా ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంవోలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు అక్కడే కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. వీరపాండ్యన్‌ను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా కొనసాగించగా, కడప జిల్లా కలెక్టర్‌గానే శ్రీధర్‌ను కొనసాగించేలా ఆదేశాలు వెలువడాయి. అలాగే, ఐపీఎస్‌ అధికారులు విక్రాంత్‌ పాటిల్‌, సిద్ధార్థ్‌ కౌశల్‌లకు కూడా పదోన్నతులు అందజేశారు.