తదుపరి వార్తా కథనం

CA Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో.. నేటి నుంచి జరగాల్సిన CA పరీక్షలు రద్దు
వ్రాసిన వారు
Sirish Praharaju
May 09, 2025
09:33 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం భారత్,పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితే కొనసాగుతోంది.పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న భారత రాష్ట్రాలపై పాక్ సైన్యం డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేపట్టింది.
అయితే భారత రక్షణ వ్యవస్థ (ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్)చురుకైన స్పందనతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.
అక్కడితో ఆగకుండా,భారత్ ప్రతిదాడులకు పాల్పడి పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో,దేశవ్యాప్తంగా మే 9 నుండి మే 14 వరకు జరగాల్సిన చార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఇంటర్మీడియట్,ఫైనల్ పరీక్షలను రద్దు చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారికంగా ప్రకటించింది.
అలాగే, ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించబడతాయన్న దానిపై త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తామని కూడా ఐసీఏఐ స్పష్టం చేసింది.