Page Loader
111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక
నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక

111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ నెలలో కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ మొత్తం 111 ఔషధ నమూనాలను 'నాణ్యతకు తగ్గవిగా' (NSQ) గుర్తించింది. ఈ నమూనాలలో 41 సెంట్రల్ ల్యాబొరేటరీలో, 70 స్టేట్ ల్యాబొరేటరీలలో పరీక్షించారు. ఔషధాన్ని NSQగా గుర్తించడం దాని నాణ్యతా ప్రమాణాలలో ఒక్కదానైనా విఫలమయ్యాక జరుగుతుంది. ఇది ఆ బ్యాచ్‌కు సంబంధించిన సమస్య మాత్రమేనని, మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఔషధాలపై ఆందోళన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. CDSCO తన నిరంతర నిఘా కార్యక్రమంలో భాగంగా విక్రయ కేంద్రాలు, పంపిణీ కేంద్రాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షిస్తుంది. పరీక్ష ఫలితాల ప్రకారం, ప్రతి నెలా NSQగా గుర్తించిన ఔషధాల జాబితాను CDSCO పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతుంది.

Details

నకిలీ ఔషదాలుగా గుర్తింపు

నవంబర్ నెలకు సంబంధించిన NSQ ఔషధాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రతి ఔషధం తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారుల వివరాలు, అలాగే అది విఫలమైన పరీక్షల సమాచారం అందుబాటులో ఉంది. ఇక నవంబర్‌లో రెండు ఔషధ నమూనాలు నకిలీ ఔషధాలుగా గుర్తించారు. వీటిలో ఒకటి బీహార్ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ సేకరించగా, మరొకటి CDSCO, ఘాజియాబాద్ సేకరించింది. ఈ నకిలీ ఔషధాలు అనధికార, గుర్తుతెలియని తయారీదారులచే తయారైనవిగా గుర్తించారు. ఈ నకిలీ ఔషధాలు ఇతర కంపెనీల బ్రాండ్ల పేర్లను వాడుతూ తయారు చేసినవిగా గుర్తించారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.