Loading...
Abhijeet Deepke: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే మోదీ ఓటమి ఖాయం.. దీప్కే సంచలన వ్యాఖ్యలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే మోదీ ఓటమి ఖాయం.. దీప్కే సంచలన వ్యాఖ్యలు

Abhijeet Deepke: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే మోదీ ఓటమి ఖాయం.. దీప్కే సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓటమి పాలవుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికార మార్పిడి ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వివరాలు

2029 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: అభిజీత్ దీప్కే

కేరళలోని కొచ్చిలో నిర్వహించిన 'జంతర్ మంతర్ ఎట్ కొచ్చి' నిరసన కార్యక్రమంలో దీప్కే మాట్లాడారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, ఆ ఎన్నికల ద్వారానే కేంద్రంలో ప్రభుత్వ మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకుంటే ప్రధాని మోదీ కూడా అధికారం కోల్పోతారని వ్యాఖ్యానించారు.

వివరాలు

యువతను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది

ప్రభుత్వం యువతను లక్ష్యంగా చేసుకుంటోందని దీప్కే ఆరోపించారు. ప్రజలు ఏం తినాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరికి ఓటు వేయాలి? అనే విషయాలను కూడా నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్, మహాత్మా గాంధీ, జవాహర్‌లాల్ నెహ్రూ ఆశయాలే దేశానికి పునాదులని పేర్కొన్నారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాతో నిరసన తెలిపినందుకు తనతో పాటు పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాను అరెస్టు చేశారని దీప్కే గుర్తుచేశారు. ఎక్కడికి వెళ్లినా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా పాల్గొన్నారు.

ADVERTISEMENT