Train Tickets: ట్రైన్ ఆలస్యమైతే చాలు… ఈ ఒక్క స్టెప్‌తో టికెట్ డబ్బులు పూర్తిగా రీఫండ్!
ఈ వార్తాకథనం ఏంటి
మీ ట్రైన్ రైల్వే శాఖ నిర్ణయించిన సమయానికి మూడు గంటలకు మించి ఆలస్యమైందా? ట్రైన్‌లో ఏసీ పనిచేయకపోతుందా? రైలు దారి మళ్లించారా? కోచ్ కాన్ఫిగరేషన్ మార్చారా? టికెట్ ఉన్నప్పటికీ మీరు ప్రయాణం చేయలేకపోయారా?—ఇలాంటి ఏ పరిస్థితుల్లోనైనా మీ టికెట్ మొత్త డబ్బును 'పూర్తిగా రీఫండ్' రూపంలో పొందే హక్కు మీకు ఉంది. కానీ చాలామందికి ఈ సౌకర్యం గురించి తెలియకపోవడం వల్ల లేదా తెలిసినా దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోవడంతో రీఫండ్ కోల్పోతున్నారు. పై పరిస్థితులు ఎదురైనప్పుడు మీకు టికెట్ మొత్తం మొత్తం తిరిగి వస్తుంది. దీనిని ఎలా పొందాలో తెలుసుకోవాలి.
Details
టీడీఆర్ అంటే ఏమిటి? ఎప్పుడు ఫైల్ చేయాలి?
టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రిసిప్ట్. కింది పరిస్థితుల్లో మీరు టీడీఆర్ ఫైల్ చేయవచ్చు: మీ ట్రైన్ మూడు గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే ట్రైన్ క్యాన్సిల్ అయితే రైలు దారి మళ్లించినప్పుడు మీరు బుక్ చేసిన క్లాస్ అందుబాటులో లేకపోతే కోచ్ కాన్ఫిగరేషన్ మార్పుతో మీరు ప్రయాణం చేయలేకపోతే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో 'TDR' అనే ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అక్కడ పీఎన్‌ఆర్ నెంబర్ ఎంటర్ చేసి, కారణం పేర్కొంటే రీఫండ్ జమ అవుతుంది.
Details
ఆన్‌లైన్‌లో టీడీఆర్ ఎలా ఫైల్ చేయాలి?
1. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి 2. మీ లాగిన్ వివరాలతో అకౌంట్‌లోకి ప్రవేశించండి 3. My Account ట్యాబ్‌లో My Transactions ఆప్షన్‌ను ఎంచుకోండి 4. అక్కడ కనిపించే File TDR ట్యాబ్‌పై క్లిక్ చేయండి 5. మీ PNR నెంబర్ ఎంపిక చేసి, కారణం సెలెక్ట్ చేయండి 6. ఎన్ని మంది ప్రయాణికుల కోసం టీడీఆర్ వేస్తున్నారో గుర్తించండి 7. File TDR బటన్‌పై క్లిక్ చేయండి 8. సూచనలు చదివి Yes బటన్‌పై క్లిక్ చేయండి 9. "TDR Successfully Filed" అనే మెసేజ్ స్క్రీన్‌పై ప్రదర్శితం అవుతుంది
Details
ఆఫ్‌లైన్‌లో టీడీఆర్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు ఆఫ్‌లైన్‌లో కూడా టీడీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం: సమీప రైల్వే స్టేషన్‌కి వెళ్లాలి టికెట్ కౌంటర్‌లోని ఉద్యోగులను సంప్రదించాలి వారు మీ తరఫున టీడీఆర్ ఫైల్ చేసి, మీ రీఫండ్ ప్రక్రియను పూర్తి చేస్తారు ఈ విధంగా పై పరిస్థితుల్లో టికెట్ మొత్తం రీఫండ్ పొందడం చాలా సులభం.