PM Modi: వాళ్లు రివాల్వర్లు ఇస్తే, మేం విద్యను అందిస్తున్నాం : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు బిహార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీతామర్హిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్జేడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్ ప్రజలకు తాము ల్యాప్‌టాప్‌లు ఇస్తే, ఆర్జేడీ మాత్రం రివాల్వర్లు ఇస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహార్ విద్యార్థుల భవిష్యత్తు కోసం మేం కంప్యూటర్లు, ఫుట్‌బాల్‌లు, హాకీ స్టిక్‌లు అందిస్తున్నాం. కానీ ఆర్జేడీ మాత్రం ప్రజలకు తుపాకులు ఇవ్వడమే మాట్లాడుతుంది. బిహార్ ప్రజలు ఇప్పుడు తుపాకుల ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు. వారు ప్రతిపక్ష నాయకులకు నిద్రలేని రాత్రులు ఇస్తున్నారని మోదీ అన్నారు. ఆర్జేడీ ఎన్నికల ప్రచారంలో చూపిస్తున్న ధోరణిపై ఆయన తీవ్రంగా విమర్శించారు. వారి సభల్లో జంగిల్‌రాజ్ నినాదాలు వినిపిస్తున్నాయి.
Details
పరిశ్రమలపై కాంగ్రెస్ కు అవగాహన లేదు
అమాయక పిల్లలతో దోపిడీదారులుగా మారాలని చెప్పిస్తున్నారు. మన పిల్లలు డాక్టర్లు అవ్వాలా లేక దోపిడీదారులు అవ్వాలా? చెడ్డవారిగా మారాలని కోరుకునే వారిని మనం గెలిపిస్తామా?" అని ప్రశ్నించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు పరిశ్రమలపై కనీస అవగాహన లేదని, పరిశ్రమలను మూసివేయడమే వారికి తెలుసని మోదీ ఎద్దేవా చేశారు. జంగిల్ రాజా 15 ఏళ్ల పాలనలో ఒక్క పెద్ద ఆసుపత్రి కానీ, ఒక్క వైద్య కళాశాల కానీ బిహార్‌లో స్థాపించలేదు. కానీ సీఎం నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రజల్లో కోల్పోయిన నమ్మకం తిరిగి వచ్చింది. పెట్టుబడిదారులు బిహార్‌లో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బిహార్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను నిందించిన వారిని ఎన్నికల్లో శిక్షించాలని మోదీ పిలుపునిచ్చారు.