IIM-Bangalore: ఐఐఎం బెంగళూరులో షాకింగ్ ఘటన.. ప్రొఫెసర్ దంపతులపై యువతి ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని ఐఐఎం బెంగళూరు క్యాంపస్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల సీ నియాంగ్‌హౌనుయామ్ అనే యువతి.. ఐఐఎం ప్రొఫెసర్ అమర్, ఆయన భార్య అంషు ఇంట్లో చిన్నారుల సంరక్షకురాలిగా పనిచేస్తూ గత ఐదేళ్లుగా తీవ్ర వేధింపులకు గురయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంగా ఉన్న సమయంలో కూడా తనను కొట్టేవారని, ఫోన్ లాక్కొని బయటివారితో మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించింది.
వివరాలు
పొరుగువారు సహాయం అత్తకు ఫోన్
ఇంటి బయటకు వెళ్లనివ్వకుండా నిర్బంధంలో ఉంచారని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న అర్ధరాత్రి సమయంలో జుట్టు పట్టుకుని ఈడ్చుతూ దాడి చేశారని, మే 4న రోజంతా ఆహారం కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. అదే సమయంలో ఓ పొరుగువారు సహాయం చేయడంతో ఆమె తన అత్తకు ఫోన్ చేసి విషయం తెలిపింది. అనంతరం ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బెంగళూరులోని మికో లేఔట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.